Mahaa Daily Exclusive

  మెట్రో ఛార్జీలు హైక్ రేపటి నుంచే అమల్లోకి =మొదటి రెండు స్టాప్‌లకు రూ.12 గరిష్ట టికెట్ ధర రూ. 75 పెంచుతూ నిర్ణయం..!

Share

మహా: హైదరాబాద్ నగర మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. టికెట్ ధరలను పెంచుతూ ఎల్‌అండ్‌టీ హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు మే 17వ తేదీ నుంచి (రేపటి నుంచి) అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా ప్రకటించింది. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కనిష్ఠ ఛార్జీ రూ.10 నుంచి రూ.12కు, గరిష్ట ఛార్జీ రూ.60 నుంచి రూ.65కు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండడంతోనే ఈ ఛార్జీల పెంపు అనివార్యమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కనిష్ట ఛార్జీ రూ.10 ఉండగా.. దాన్ని రూ.12కు పెంచారు. ఇక గరిష్ట ఛార్జీ రూ.60 ఉండగా.. దాన్ని రూ. 65కు పెంచారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒక్కటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా రూ.150 – రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీలు పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.