Mahaa Daily Exclusive

  నీళ్లు పోస్తే కాళ్లు కడిగినట్టేనా? కాళ్లు కడిగించుకునే దొరల సంస్కృతి మీది బీఆర్ఎస్ నేతలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్..1

Share

మహా: ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంటును రుద్ది ప్రతిష్టను దిగజార్చవద్దని మంత్రి సీతక్క హెచ్చరించారు. మిస్ వరల్డ్ కంటేస్టెంట్ల ములుగు, రామప్ప దేవాలయ పర్యటనను వివాదాస్పదం చేస్తున్నారని బీఆర్ఎస్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్నీ వక్రీకరించడం బీఆర్ఎస్‌కు పరిపాటిగా మారింది అంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా నిన్న మిస్ వరల్డ్ కాంటెస్ట్స్ వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వద్ద హెరిటేజ్ వాక్ పర్యటన ఏర్పాట్లు చేసిన ఉన్నతాధికారులకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారని, కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని సెటైర్లు వేశారు. ఎవంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకొని తిరిగిన నాయకుడు.. ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. గుళ్లలోకి కాళ్ళు కడుక్కొని వెళ్ళడం గిరిజన సంప్రదాయం.. అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్ళకు నీళ్ళు పోసింది. దానిని పట్టుకొని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బద్నాం చేస్తున్నారని, నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగితే అందరి కాళ్ళు కడిగించాలి కదా..? దానిని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? కవితమ్మ కాళ్ళ దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టినప్పుడు.. కేసీఆర్ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం మీ దురహంకారం కదా.. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారంటూ కామెంట్స్ చేశారు.
అబద్దాలకు అంబాసిడర్‌ ఆమె..
తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా..? అంటూ నిప్పులు చెరిగారు. ఈమధ్య సబితా ఇంద్ర రెడ్డి ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసని.. అబద్ధాలు కాకుండా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. అబద్దాలకు అంబాసిడర్‌గా సబితమ్మ మారకూడదన్నారు. అధికారం పోయాక.. ప్రజలు, ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. ఇవాంక ట్రంప్ హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఆమె వెంట తిరిగిన నాయకుడు ఎలాంటి సంస్కృతి సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసన్నారు. గిరిజన సంప్రదాయంలో గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుగుకొని వెళ్లడం సంప్రదాయం.. అదే అక్కడ పాటించారన్నారు. ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ అమ్మాయి.. కాళ్లకు నీళ్లు పోసిందని.. దాన్ని పట్టుకుని నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగిస్తే.. అందరి కాళ్లు కడిగించాలి కదా? కానీ అక్కడ అలా జరగలేదన్నారు. అయినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా? అని బీఆర్ఎస్ నేతలపై ఫైరయ్యారు.