Mahaa Daily Exclusive

  కొల్లేరు సరస్సులో అక్రమ నిర్మాణాల తొలగింపు వేగవంతం చేయండి : జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీప్రసాద్

Share

ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ డ్రైన్స్ మరియు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ గారు అధ్యక్షత వహించారు.

సమీక్ష సమావేశంలో కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. కొల్లేరు ప్రాంతంలో నీటి ప్రవాహం, డ్రైనేజ్ సమస్యలు, అక్రమ నిర్మాణాలు, పచ్చదనం పరిరక్షణ, వనరుల సంరక్షణ మరియు వర్షాకాలం నాటికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై విపులంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఘంటా పద్మ శ్రీ ప్రసాద్ గారు మాట్లాడుతూ, “కొల్లేరు పరిరక్షణ మనందరి బాధ్యత. ఇరిగేషన్, ఫారెస్ట్ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి” అని అన్నారు.

సమీక్షలో జిల్లా అధికారులు, ఇరిగేషన్ మరియు ఫారెస్ట్ శాఖల కీలక అధికారులు పాల్గొన్నారు.