Mahaa Daily Exclusive

  కేటీఆర్‌కు అండగా ఉంటాం రేవంత్ అభద్రతకు నిదర్శనమే నోటీసులు -మాజీ మంత్రి హరీశ్ రావు

Share

మహా: ఫార్ములా ఈ-కారు రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ జారీ చేసిన నోటీసులపై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం రేవంత్ నెలకొన్న అభద్రతను సూచిస్తున్నాయని హరీశ్ రావు ఎక్స్ వేదికగా కామెంట్స్ చేశారు. అందుకే ఆయన ఈ ప్రతికార రాజకీయ చర్యలు ఎంచుకున్నారని, తప్పుడు కేసులో ఫొటోలు నిలవవు ప్రజల మనసును గెలుచుకోలేవన్నారు. తాము కేటీఆర్‌కు అండగా ఉంటామని, ఎప్పటికైనా నిజమే గెలిచి తీరుతుందని ఎక్స్‌లో ట్వీట్ చేశారు