Mahaa Daily Exclusive

  ఆయన దేవుడెలా అవుతాడు దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దెయ్యాలను రాష్ట్ర పులి మేరల నుంచి తరిమికొట్టాలి వందమంది కేసీఆర్ లు అడ్డం వచ్చినా తెలంగాణ ప్రగతి ఆగదు అచ్చంపేట సభలో డిప్యూటీ సీఎం భట్టి..!

Share

మహా : దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడు? దెయ్యాలను రాష్ట్ర పులి మేరల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందనీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అచ్చంపేటలో పలు విద్యుత్ సబ్ స్టేషన్లు ప్రారంభించి, మరి కొన్ని సబ్ స్టేషన్లుకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆయన కూతురు కవిత ఇప్పుడు చెబుతుంది కానీ ఎన్నికల ముందే రాష్ట్ర ప్రజలు ఈ దయ్యాలను వదిలించుకొని రాష్ట్ర ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. మరో రెండు దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర అభివృద్ధికి కావలసిన ప్రణాళికలను ప్రజా ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వరుస సంక్షేమ పథకాలు, ఉద్యోగ, స్వయం ఉపాధి కార్యక్రమాలతో బాగుపడుతున్నారని, తన దగ్గరకు ఎవరూ రావడం లేదని కెసీఆర్ దుఃఖపడుతున్నాడన్నారు. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్ గా మిగులుతుందన్నారు. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ఉద్యోగులకు పదివేల కోట్ల బకాయిలు పెడితే, మేం అందులో ఎనిమిది వేల కోట్ల ఉద్యోగుల బకాయిలు క్లియర్ చేశామని చెప్పారు. 10 ఏళ్ళ పాటు పాలించిన కేసీఆర్ ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు. మేము అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాల కలను సాకారం చేశామన్నారు. 57 వేల ఉద్యోగాలు భర్తీ చేసాం మరో 30,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉన్నాయని తెలిపారు. అర్హత ఉండి ఉద్యోగం రాని యువత కోసం 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

లక్ష రూపాయల రైతు రుణమాఫీని 10 సంవత్సరాల కాలంలో వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తే అది ఆనాడు బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని, ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరంభంలోనే ఒకేసారి 22 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామన్నారు. రైతులే కాదు భూమిలేని కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ప్రతి ఏటా 12 వేల రూపాయలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ఆర్థికంగా నిలబడేలా ప్రతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎంతటి ఆర్థిక భారం అయినా సరే రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ పేదల ఖర్చు భారం తగ్గించేందుకు రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరెంటు అందజేస్తున్నామని, రైతుల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు 12,500 కోట్లు చెల్లిస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత అని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ ప్రాజెక్టు జీవో ఇచ్చిందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనే డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మూడు నెలలు ఆరు నెలలు రెండు సంవత్సరాల్లో పూర్తిచేసే ప్రాజెక్టులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినట్టు అచ్చంపేట నియోజకవర్గం లో 45వేల పంపుసెట్ల కు సోలార్ పవర్ ఏర్పాటు చేయడంపై విద్యుత్ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు. ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం 10 కాలాలపాటు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని డిప్యూటీ సీఎం అన్నారు.