మహా: ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ పచ్చ జెండా ఊపింది. 22మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, 15మందితో అడ్వైజరీ కమిటీ, ఏడుగురితో డీలిమిటేషన్ కమిటీ, 16మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, ఆరుగురితో డిసిప్లెనరీ యాక్షన్ కమిటీలను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తో పాటు చల్లా వంశీచంద్ రెడ్డి, రేణుకా చౌదరి, బలరామ్ నాయక్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, కుసుమ కుమార్, ఈరవత్రి అనిల్ కుమార్‌లు ఉన్నారు. అలాగే ఇక ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఏఐసీసీ సెక్రటరీలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ హెడ్స్ వ్యవహరిస్తుండా, స్పెషల్ ఇన్వైటీస్‌గా క్యాబినెట్ మంత్రులు ఉండనున్నారు.
అడ్వైజరీ కమిటీ
మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్‌కు మార్ యాదవ్, టి. జయ ప్రకాశ్ రెడ్డి, జాఫర్ జావేద్, టి. జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్
డీలిమిటేషన్ కమిటీ
చల్లా వంశీచంద్ రెడ్డి (చైర్మన్), గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, శ్రవణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, వెంకటరమణ
సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ
పి. వినయ్ కుమార్ (చైర్మన్), అద్దంకి దయాకర్, శంకరయ్య, బాలు నాయక్, ఎ.నర్సిరెడ్డి, ఆత్రం సుగుణ, రాచమళ్ల సిద్ధేశ్వర్, సంతోష్ కొలకొండ, పులి అనిల్ కుమార్, జూలూరి ధనలక్ష్మి, మజీద్ ఖాన్, రాములు, అర్జున్ రావు, శౌరి, కొల్లం వల్లభ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి
డిసిప్లినరీ యాక్షన్ కమిటీ
మల్లు రవి (చైర్మన్), శ్యామ్ మోహన్ (వైస్ చైర్మన్), నిరంజన్ రెడ్డి, కమలాకర్‌రావు, జాఫర్ జావేద్, జీవీ రామకృష్ణ








