మహా
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, తన భార్యతో కలిసి చిత్రకూట్ లోని జగద్గురు స్వామి రామభద్రాచార్యుల తులసీ పీఠాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఆయన రామభద్రాచార్యుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అలాగే కాంచ్ ఆలయంలో స్వామి రామభద్రాచార్యుల చేతుల మీదుగా దీక్షను తీసుకున్నారు. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను తనకు దక్షిణగా ఇవ్వాలని ఆర్మీ చీఫ్‌ను రామభద్రాచార్య కోరారు. అలాగే 2016 తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి వెళ్లి పాక్‌పై దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్వామిజీ స్పందించారు. శశిథరూర్ చెప్పింది నిజమేనన్నారు. శశిథరూర్ అనుభవజ్ఞుడైన నాయకుడని, తాను ఆయన చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు.
Post Views: 43








