రంగారెడ్డి జిల్లా మహా:
ఆరో వాడలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో, మున్సిపల్ వార్డు ఆఫీసర్ ఆమేర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు షౌకత్ అలీఖాన్ సమక్షంలో, ఆరవ వార్డుకు చెందిన రేష్మ బేగం షాహిద్ కు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇంటి భూమి పూజ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను సద్వినియోగం చేసుకోవాలని, సకాలంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Post Views: 35








