రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం అని ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వెల్జాల్ కాంగ్రెస్ నాయకులు జి శ్రీనివాస్ మూర్తి, మల్లికేడి అంబాజీ, ఎమ్ఏ అజీజ్ అన్నారు. గురువారం తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చర్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని వారు అన్నారు. పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బి నర్సింలు, హీనా బేగం ఆరిఫ్, పులిజాల విష్ణు, నాయకులు మిడ్తా రమేష్, పిఅంజనేయులు,పి. జంగయ్య కె విష్ణు, కే వేణు, బి రామకృష్ణ, ఎం బాలస్వామి,గ్రామ పంచాయతీ కారో బార్ జి రవి, పి.చంద్రకళ, పార్టీ, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.








