Mahaa Daily Exclusive

  జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి జిల్లా అధికారులకు ఆదేశాలు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి..!

Share

 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొంగరకలాన్ లోని జిల్లా కార్యాలయంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అట్టహాసంగా వేడుకలు జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా సమగ్ర వివరాలతో జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. స్టేజీని పూలతో అందంగా అలకరించేందుకు ఉద్యానవన శాఖ అధికారిని ఆదేశించారు. సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సందేశం రూపొందించేందుకు ఆయా శాఖలు సాధించిన ప్రగతి నివేదికలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని అన్నారు. పోలీసు గౌరవ వందనంతోపాటు వేడుకలలో పోలీసు బందో బస్త్ ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులకు సూచించారు. పాఠశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని డి.ఈ.ఓ.ను ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
  ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏ.ఓ సునీల్, జిల్లా అధికారులు, పోలీసు శాఖ అధికారులు,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.