రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని, గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న ఋతికేష్ అనే విద్యార్థి ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే నిన్న గురునానక్ కాలేజీలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరిగింది జరిగింది. ఫేర్వెల్ పార్టీ అనంతరం తన క్లాస్మేట్ మంగళపల్లి ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న సంజయ్ దగ్గరికి వెళ్లి, హాస్టల్లో పార్టీ చేసుకుని అర్ధరాత్రి సమయంలో ఇబ్రహీంపట్నం తిరుగు ప్రయాణంగా ఋతికేష్, శంకర్ ఒకే మోటార్ సైకిల్ మీద బయలుదేరి వస్తున్న సందర్భంలో శేరిగూడలోని గాంధీ విగ్రహం వద్దకు రాగానే మోటార్ సైకిల్ అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో అక్కడికక్కడే ఋతుకేష్ మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన శంకరును నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడు ఋతికేష్ మంచిర్యాల జిల్లా, మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు.








