Mahaa Daily Exclusive

  సర్కారు బదుల్లోనే నాణ్యమైన భోదన విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి..!

Share

ఆదిలాబాద్, మహా:

ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన భోదనను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యా శాఖా ఆర్జేడీ సత్యనారాయణ రెడ్డి సూచించారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో గల యూపిఎస్ మరాటీ మీడియం పాతశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో మొదటి తరగతి విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, పెన్నులు అందచేశారు. అంతకుముందు శ్రీ సరస్వతి దేవి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన భోధన అందుతోందని తల్లితండ్రులు వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించి ప్రోత్సాహం అందించాలన్నారు. ప్రభుత్వ పాతశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. బడిబాట లో భాగంగా ప్రవేశాల సంఖ్య పెంచుతూనే మూతపడిన పాతశాలలను తెర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయన వెంట డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, కో ఆర్డినేటర్ సుజాత్ ఖాన్, స్కూల్ హెచ్ఏం గణేష్ తదితరులు ఉన్నారు.