Mahaa Daily Exclusive

  పట్టాగా మార్చి పాసుపుస్తకాలు ఇవ్వాలి…. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ రాం పర్వతాలు..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎస్సీ ఎస్టీలకు బలహీనవర్గాలకు అసైన్డ్ భూములు ఇవ్వడం జరిగిందని కల్వకుర్తి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంపర్వతాలు అన్నారు. ప్రభుత్వాలు మారిన దళితుల తలరాత మారడం లేదు. అసైన్డ్ భూములను వెంటనే భూభారతి చట్టంలో దళితులకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీ ప్రకారంగా పట్టాలు చేయాలని, భూభారతిలో అసైన్డ్ భూములను పునరుద్ధరణ చేసి క్రయవిక్రయాలు జరిగే విధంగా అమలు చేయాలని, భూభారతి చట్టంలో పొందుపరచడంతో ఎస్సీ ఎస్టీలు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా రుణపడి ఉంటారని ఆయన కోరారు.

కల్వకుర్తి మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంపర్వతాలు మాట్లాడుతూ… దివంగత మాజీ ప్రధాని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ భూమి పట్టాలను అందజేయడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు ఇందిరా గాంధీ ఇచ్చిన ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మారుస్తూ పట్టాదారులు క్రయవిక్రయాలు చేసుకునే విధంగా లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని పొందుపరచడం జరిగింది.

ఇచ్చిన మాట ప్రకారం పట్టాగా మార్చి పాస్ పుస్తకాలు ఇవ్వాలి….
నేడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కొత్త చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ప్రకారం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు పట్టాలుగా మార్చి రైతులకు భూభారతి చట్టం ద్వారా కొత్త పాసుపుస్తకాలు అందించి రేవంత్ సర్కార్ మాట నిలబెట్టుకోవాలని ఆయన కోరారు.