ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ఆర్టిసి బస్టాండ్లో త్రీ మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కాటారం కలెక్టర్ మాయాంక్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్ లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్ మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన
షీ, మాతా శిశు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాల మేరకు కాళేశ్వరంలోని శాశ్వత బస్ స్టాండ్ కు మార్చినట్లు కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తెలిపారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం బస్ స్టాండ్ లో షీ, మాతా శిశు కేంద్రం ఏర్పాటుపై ఒక ప్రకటన జారీ చేశారు. కాళేశ్వరం వచ్చే
మహిళలకు బస్ స్టాండ్ లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని మహిళలు, పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.








