రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
వచ్చే ఎన్నికలలో నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరడం ఖాయమని బోసుపల్లి ప్రతాప్ అన్నారు. మహేశ్వరం మండలం, నాగారం గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యశాల సమావేశం, మండల అధ్యక్షులు యాదిష్ ఆధ్వర్యంలో నిర్వహించిన, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బోసుపల్లి ప్రతాప్ హాజరై మాట్లాడుతూ… మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని పేర్కొన్నారు. గతంలో 9 మంది సర్పంచులు, 5 ఎంపీటీసీలు, 14 గ్రామాలలో బిజెపి బహుట ఎగరేసింది అని గుర్తు చేశారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గం కాషాయమయం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణం కాపాడడానికి చెట్లు మొదటి ప్రాముఖ్యత అని చెట్లను నాటడం జరిగింది. 11 సంవత్సరాల మోడీ పాలనను, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పర్యావరణ, శక్తి కేంద్రాలలో రచ్చ బండ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు పై ప్రశ్నించాలని ఆదేశించారు. ఏమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నిరసన కార్యక్రమాలపై కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేశారు. పహాల్గామ దాడి ఘటన పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ లాంటి కఠిన నిర్ణయాలపై, శత్రుదేశం పట్ల నిర్వహించిన తీరూపై ప్రజలు చర్చించుకున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ ఘటనలో మరణించినటువంటి కుటుంబాలకు నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బొక్క నర్సింహారెడ్డి, పాపయ్య గౌడ్, జంగయ్య యాదవ్, సుదర్శన్ రెడ్డి, అనంతయ్య గౌడ్, యాదయ్య గౌడ్, కుండే వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.








