Mahaa Daily Exclusive

  రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్ రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయం స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుస్తాం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు..!

Share

మహా: దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేసిన దమ్మున్న నాయకుడు రేవంత్‌రెడ్డి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభివర్ణించారు. దేశమంతా పాదయాత్ర చేసి కులగణనకు ఆలోచన చేసిన నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రఘునాథపాలెం మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. రేగులచలక, కోయచెలక గ్రామాల్లో సీసీ రోడ్లు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రఘునాథపాలెం మండలం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఉద్ఘాటించారు. దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాలనలో దేశమంతా రూ. 70 వేల కోట్లు రుణమాఫీ చేస్తే.. తెలంగాణలో రూ. 21 వేల కోట్లు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

నా రాజకీయ లక్ష్యం అదే..
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రైతు భరోసా విషయంలో వెనుకడుగు వేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారం చేయాలని కోరారు. ఇతర జిల్లాల వారు ఖమ్మంలో నివసించాలనే ఆలోచనలు వచ్చేలా ఖమ్మం నగరాభివృద్ధి జరుగుతోందని తెలిపారు. అధికార పార్టీ వారు సర్పంచ్‌లు.. ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా ఎన్నికైతే ప్రజలకు చేరువ కావొచ్చని చెప్పారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయడం తన రాజకీయ లక్ష్యమని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమమే ప్రజా పాలన ధ్యేయమని చెప్పారు. పనిచేసే కార్యకర్తలకు పార్టీ పదవుల్లో పెద్దపీట వేస్తామని అన్నారు. ప్రజాభిమానం ఉంటే పదవులు అవే దక్కుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ చేశారు.