Mahaa Daily Exclusive

  త్వరలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన ..!

Share

మహా: స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించబోతున్నామని, ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని.. అందుకోసం పార్టీలో కొత్త, పాత నేతలు అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమష్టిగా పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె సూచించారు.
ఎన్నికల సంఘం సైతం ఏర్పాట్లు..
ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తన కసరత్తును వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటోంది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తోంది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా సవరణ, ఎన్నికల సిబ్బంది కొరత లేకుండా చూసేలా చర్యలు తీసుకుంటోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా ఎన్నికల సంఘం అధికారులను ఆదేశిస్తోంది.