Mahaa Daily Exclusive

  పుణ్య స్నానాలకు వెళ్లి పరలోకానికి …. బాసర గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతి..!

Share

ఆదిలాబాద్, మహా:

నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పుణ్య స్నానాల కోసం బాసరకు వచ్చిన హైదరాబాద్ ప్రాంతంలోని చింతల్ కు చెందిన ఐదుగురు యువకులు రాకేష్ (17), వినోద్ (18), రితిక్ (18), భరత్, మదన్ (17)ఆదివారం గల్లంతయ్యారు.వివరాల్లోకెళ్తే హైదరాబాద్ కు చెందిన 22 మంది సన్నిహిత కుటుంబ సభ్యులు ఆదివారం పవిత్ర పుణ్యక్షేత్రం బాసర సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. గోదావరి నదిలో స్నానానికి వెళ్లగా నదిలో లోతైన ప్రాంతం గమనించకుండ ఐదుగురు యువకులు నీటిలో దిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల కళ్ళముందే ఈ ఘటన జరుగుతున్న ఏమి చేయలేని నిస్సహయ స్థితిలో ఉండిపోయారు. ఘటన స్థలంలో యాత్రికులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన గజ ఈతగాళ్లతో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మరొక యువకుని కోసం నదిలో గాలింపు చర్యల చేపట్టగా శవం లభ్యమైంది. మృతదేహాలను ఆంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు నీటిలో నుంచి గజ ఈతగాళ్లు శవాలను బయటికి తీయగా కుటుంబ సభ్యులు పీసీ ఆర్ చేసి బతికించుకోవడానికి కష్టపడుతున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఏదేమైనప్పటికీ వర్షాకాలం మొదట్లోనే ఇలాంటి ఘటనలు జరగడం పట్ల భక్తులను భయాందోళనలను గురిచేస్తున్నాయని యాత్రికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ఆ తల్లిరోదన పలువురు ని కంటతడి పెట్టించింది.

Latest