ఆదిలాబాద్, మహా:
అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ అన్నారు. విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు విడిచిన వారికి సనాతన హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు సమర్పించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల కార్గిల్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ప్రమాదంలో తనువు చాలించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గెడం మాధవ్, కందుల రవీందర్, సూర్యకాంత్, శశికాంత్, శ్రీకాంత్, సంతోష్ అగర్వాల్, సుభాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 83








