Mahaa Daily Exclusive

  మానేరు జలాశయంపై ‘క్లీన్ కరీంనగర్ డ్యాం’..!

Share

కరీంనగర్ మహా : జలవిహార్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో క్లీన్ కరీంనగర్ డ్యాం కార్యక్రమంలో భాగంగా మానేరు డ్యాం కట్టపై ఇరు వైపులా ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలు, చెత్తను తొలగిస్తూ జలా శయం పరిసర ప్రాంతాన్ని సుందరీకరిస్తున్నారు. ఆదివారం ఉదయం కరీంనగర్ మానేరు డ్యాం లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రమేష్ , జలవిహార్ గ్రూప్ సభ్యుల ఆధ్యర్యంలో క్లీన్ కరీంనగర్ డ్యాం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధ్యక్షులు పాశం రాజిరెడ్డి, కలర్ సత్తన్న, రఘునందన్ రాజు, జలవిహార్ గ్రూప్ సభ్యులకు ఆభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జలవిహార్ గ్రూప్ సభ్యులకు ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు.

Latest