Mahaa Daily Exclusive

  ఆపదలో ఉన్న వారికి అండగా మన సనాతన హిందూ సేవా సమితి..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్ నగరంలో అనుకోని పరిస్థితులలో సర్వం కోల్పోయి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలుస్తూ మేమున్నామంటూ వారికి మనోధైర్యంతో పాటు కొంత ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్న
మన సనాతన హిందూ సేవా సమితి సేవలను పలువురు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా మన సనాతన హిందూ సేవా సమితి నుండి 77 వ సేవా కార్యక్రమంలో భాగంగా చిన్న వయసులోనే భర్త మృతి చెందడం తో పిల్లల చదువులు, పోషణ భారంగా మారి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వరంగల్ నగరం కాశిబుగ్గ లోని శాంతి నగర్ కు చెందిన పర్లపెల్లి దీపిక కు రెండు నెలలకు సరిపడా బియ్యం, అలాగే నిత్యావసర సరుకులను అందించారు. ఈ కార్యక్రమం లో సేవా సమితి వ్యవస్థాపకులు తాళ్లపల్లి నగేష్,, అధ్యక్షుడు మిట్టపెల్లి వేణు, ఉపాధ్యక్షుడు అనుమాండ్ల రాజేందర్, సలహాదారు అంచూరి వేణు గోపాల్, గ్రూప్ సభ్యులు నోముల మహేష్ బాబు, గందమళ్ళ సాయి కుమార్, గంగిడి ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Latest