హన్మకొండ మహా;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని న్యాయస్థాన ప్రాంగణంలోని శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించి మొత్తం 13754 కేసులు పరిష్కారం జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కారమైన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడిస్తూ పోలీస్ స్టేషన్లల్లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కేసులకు సంబంధించి మొత్తం 991 కేసులు పరిష్కారం కాగా ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 455 కేసులు, ఈస్ట్‌జోన్ పరిధిలో 258, వెస్ట్‌జోన్ పరిధిలో 278 కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యాయని, అలాగే డిసాస్టర్ మేనేజ్మెంట్ కేసులు 5248 కేసులు, ఈ పెట్టి కేసులు 4701, మోటార్ వెహికిల్ యాక్ట్ కేసులు2551లు పరిష్కారించబడ్డాయి. ముఖ్యంగా సైబర్ నేరాలకు సంబంధించి పెండిరగ్‌లో ఉన్న 263 సైబర్ కేసుల్లో 1,06,52,078/- రూపాయలు సైబర్ బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలిందిగా కోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో పాటు మరో 44 కేసుల్లో 20,81,188/` రూపాయలు సైబర్ బాధితులు అందజేయడం జరిగిందని వరంగల్ పోలీస్ కమీషనర్ తెలిపారు.








