వరంగల్ మహా;
ఇటీవల వరంగల్ సబ్ డివిజన్ లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసు అధికారులు చోరీల పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు చేస్తున్నప్పటికీ దొంగలు వారి పనితనం చూపిస్తూనే ఉన్నారు.
వరంగల్ నగరం నడిబొడ్డున గల పోచమ్మ మైదాన్ జంక్షన్ లో ఉన్న బాలాజీ బార్ & రెస్టారెంట్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి బార్ లోకి చొరబడి చోరికి పాల్పడ్డాడు. శనివారం అర్థరాత్రి సుమారు 1:20 సమయంలో చాకచక్యంగా బార్ లోకి దొంగ చొరబడి కౌంటర్ లో ఉన్న 6,800/- రూపాయల నగదును దొంగిలించినట్లు సమాచారం. ఈ దొంగ పనితనం అంతా బార్ లోని నిఘానేత్రాలలో నిక్షిప్తమైంది. ఆదివారం బార్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇదే బార్ లో ఒకసారి దొంగతనం జరిగిందని బార్ యజమాన్యం తెలిపారు. నిత్యం 24 గంటలు అత్యంత రద్దీగా ఉండే పోచమ్మ మైదాన్ జంక్షన్ ప్రాంతంలోనే దొంగతనం జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.








