హన్మకొండ మహా;
అత్యధిక సంఖ్యలో రక్తదానాన్ని చేసేందుకు ప్రోత్సాహించినందుకు గాను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు ఆదివారం రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ అవార్డు అందుకున్నారు.
ప్రపంచ రక్తదాత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాజ్ భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హై బ్లడ్ డోనార్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ కు పోలీసు అధికారులు, పలువురు ప్రముఖులు, శుభాకాంక్షలు తెలిపారు.
Post Views: 92








