రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నేడు రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా, రైతు వేదికలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం వ్యవసాయంలోని మెలకువలు, పంట దిగుబడి, రాబడి, పంట మార్పిడి వల్ల ప్రయోజనాలు, రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు చేసిన సూచనల గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రైతులతో ముఖాముఖిగా ముచ్చటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగిందని, ఇంకా రైతులకు అందించాల్సిన కావలసిన సహాయ సహకారాల గురించి రైతులతో చర్చించనున్నారు.
Post Views: 66








