TG: కాళేశ్వరం ప్రజెక్ట్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఓ ఇంటర్వూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు వంద శాతం ప్రయోజనం ఉందని అన్నారు. ఈ ప్రాజెక్టు కట్టాకే ఉత్తర తెలంగాణకు నీళ్లొచ్చాయన్నారు. వేసవిలోనూ చెరువులు, వాగులు పొంగిపొర్లాయని చెప్పారు. కుంగిన పిల్లర్లు రిపేర్ చేయించి రైతులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో అన్ని పనులు కేబినెట్ ఆమోదంతోనే జరిగాయని స్పష్టం చేశారు.
Post Views: 106








