Mahaa Daily Exclusive

  తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేస్తాం: భట్టి

Share

TG: గద్దర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సినీ అవార్డులు అందించడం గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘మా ప్రభుత్వం తెలంగాణను సినిమా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న దిశగా ముందుకెళ్తోంది. సినిమా షూటింగ్‌ అనుమతులకు సింగిల్ విండో, టూరిజం లొకేషన్లలో షూటింగ్‌కు అవసరమైన సహాయం, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కార్మిక సంక్షేమం వంటి అంశాల్లో గట్టి చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.