Mahaa Daily Exclusive

  ఆగస్టు 15 నాటికి భూసమస్యల పరిష్కారం: పొంగులేటి

Share

TG: ధరణి కారణంగా గత పదేళ్లుగా భూ సమస్యలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నఅ్నారు. ఆయా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌ నేతృత్వంలో కొత్త చట్టం చేశామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో రైతుల దరఖాస్తు చేసుకున్న సమస్యలను ఆగస్టు 15 నాటికి పరిష్కరించి విముక్తి కల్పిస్తామన్నారు. తరతరాలుగా సర్వే చేయని, నక్షాలు లేని గ్రామాలను గుర్తించి సర్వే చేసి పక్కాగా నక్షా ఏర్పాటు చేస్తామన్నారు.