ఆదిలాబాద్, మహా:
ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన అర్జీదారులు తమ సమస్యలను వినతుల రూపంలో అందచేశారు. పెద్ద ఎత్తున అర్జీదారులు హాజరు కావడంతో కలెక్టరేట్ ప్రాంగణం కిట కిట లాడింది. ఆర్జీలను స్వీకరించి వారి సమస్యలను సావధానంగా ఆలకించిన కలెక్టర్…. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, rdo వినోద్ కుమార్, వివిధ శాఖల అధికరులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ…. ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా చూడాలన్నారు.
సీఎం ప్రజావాణి లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు వచ్చే వారం లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి విభాగంలో 104 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందనీ తెలిపారు.








