Mahaa Daily Exclusive

  అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి కొండా సురేఖ పాల్గొన్న నగర మేయర్, జిల్లా కలెక్టర్, కమిషనర్..!

Share

వరంగల్ మహా;

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఓ సిటీ పార్టీ క్యాంపు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో
రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నగర మేయర్ గండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు లతో కలసి నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
మొదటగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కొండా సురేఖ కు నగర మేయర్, జిల్లా కలెక్టర్, బల్దియా కమిషనర్ పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బిఆర్ ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఇల్లు మంజూరు చేయలేదని, గత ప్రభుత్వంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇండ్లు కూడా ఏ ఒక్క పేదవారికి అందించ లేదని సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రజా పాలనలో పేదవారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం తో పాటు ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా మంజూరు చేస్తామని తెలిపారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొదటి విడతలో 1617 మందికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం కమిషన్లు వచ్చే పనులు మాత్రమే చేసిందని లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టారు, కానీ పేదల కోసం ఏం ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని అన్నారు. గతంలో నేను చే‌సిన అభివృద్ధే కనిపిస్తోందని గత 5 ఏళ్ల లో భారాస నాయకుడు తూర్పు లో ఏటువంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా చేస్తానని పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలకు 3500 ఇండ్లు వరంగల్ తూర్పుకు కేటాయించారని
నిర్ణీత సమయంలో ఇండ్ల నిర్మాణం చేసుకోవాలని అలాగే 400 నుండి 600 sft లోపే ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రొసీడింగ్స్ ఇచ్చిన వారం రోజుల్లో భూమి పూజ చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి సురేఖ తెలిపారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ సంధ్యా రాణి కార్పొరేటర్లు వస్కుల బాబు, సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, చింతాకుల అనిల్ కుమార్, భోగి సువర్ణ, పోశాల పద్మ, కావేటి కవిత, బైరబోయిన ఉమా, గుండు చందన, ఓని స్వర్ణ లత, ఫూర్కాన్ బాల్నే సురేష్ బస్వరాజు కుమార స్వామి, సురేష్ జోషి , ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి రామ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, ఆర్డిఓ సత్య పాల్ రెడ్డి, రెవెన్యూ, హోసింగ్, మెప్మా, బల్దియా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.