రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా, నవాబ్ పేట్ మండలం, చిట్టిగిద్ద గ్రామంలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సులో స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరై ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ సమస్యలను దరఖాస్తు రూపంలో సమర్పించాలని, అధికారులు తప్పకుండా భూ సమస్యలకు పరిష్కారం చేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
Post Views: 71








