Mahaa Daily Exclusive

  ప్రజావాణి ఫిర్యాదులను  వెంటనే పరిష్కరించాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…!

Share

వరంగల్ మహా;

ప్రజావాణి లో స్వీకరించిన దరఖాస్తులను  వెంటనే  పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి డిఆర్ఓ విజయలక్ష్మి,  ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, జడ్పీ సీఈఓ రామి రెడ్డి, డి ఆర్ డి ఓ కౌసల్య దేవి, హౌజింగ్ పిడి గణపతిలతో కలసి ప్రజావాణి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలకు సంబంధించిన 127 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.
రెవెన్యూ శాఖ 51, పిడి హౌసింగ్ 12,
జి డబ్ల్యూ యం సి వరంగల్ 13 దరఖాస్తులు రాగా మిగత వివిధ శాఖలకు సంబంధించినవి 51 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్యలను పరిష్కరించాలని, సమస్య పరిష్కరించలేని సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని దరఖాస్తుదారునికి అర్ధం అయ్యేలా చెప్పాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.

ఇప్పటివరకు నిర్వహించిన గ్రీవెన్స్ లో స్వీకరించిన మొత్తం 11,221 దరఖాస్తులలో 10,349 దరఖాస్తులు పరిష్కరించగా 872 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వారిని కూడా త్వరిత గతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డిసిఓ నీరజ, డిపిఓ కల్పన డిఎంహెచ్ఓ సాంబశివరావు, డీఈవో జ్ఞానేశ్వర్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.