రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
నేడు ఇబ్రహీంపట్నం మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన 17 వాణిజ్య దుకాణా సముదాయాలను, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి తెలిపారు.
నియోజకవర్గం పరిధిలోని మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలోని గ్రామాలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, నూతన పనులకు శంకుస్థాపనలు చేసి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేయనున్నారు. అనంతరం భూభారతి భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి రెవెన్యూ సదస్సులో రైతు భూ సమస్యల పరిష్కారానికి అధికారులతో కలిసి పాల్గొననున్నారు. నియోజకవర్గ ప్రజా భవన్ లో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయమన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయా కార్యక్రమాలకు సకాలంలో హాజరు కావాలని అధికారులు తెలిపారు.
Post Views: 79








