Mahaa Daily Exclusive

  ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదు: మోదీ

Share

ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి ఉండకూడదని ప్రధాని మోదీ అన్నారు. జీ7 సదస్సులో ఈ విషయంపై ప్రసంగించారు. ‘పహల్గాం ఉగ్రదాడి.. మానవత్వంపై జరిగింది. మానవత్వానికి ఉగ్రవాదం శత్రువు. అన్ని దేశాలు దీన్ని వ్యతిరేకించాలి. ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం మా విధానాలు, ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. ఎవరైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. కొన్ని దేశాలు ఓ వైపు ఉగ్రవాదాన్ని ఖండిస్తూనే.. మరోవైపు మద్దతు ఇస్తున్నాయి’ అని తెలిపారు.