Mahaa Daily Exclusive

  ప్రజా పాలనతోనే గ్రామాల అభివృద్ధి మంచాల మండలంలో 435 మందికి ఇండ్లు ఆరుట్ల చెన్నారెడ్డిగూడలో అభివృద్ధి పనులు ప్రారంభం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
మంచాల మండలంలో 435 మందికి ఇళ్ళ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రంగారెడ్డి అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాతనే గ్రామాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, వారి సొంతింటి కలను సాకారం చేస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మంచాల మండలంలోని, ఆరుట్ల, చెన్నారెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించిన ఆయన 1.40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరుట్లలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న, మొట్టమొదటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మంచాల మండల కేంద్రంలో మంచాల మండలానికి చెందిన 435 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను మరియు మండల పరిధిలోని 53 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత గ్రామాల అభివృద్దే లక్ష్యంగా అధిక నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. గత పదేళ్ల కాలంలో వెనుక బడిన విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేయడానికి, ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం చేయడానికి రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రాష్ట్రంలో మొట్టమొదటగా ఆరుట్ల గ్రామంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని అన్నారు. గత పదేళ్లలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరుగలేదని, ఏ ఒక్క కుటుంబానికి ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంచాల మండలానికి 435 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి ఇండ్లు రావడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, రాచర్ల వెంకటేశ్వర్లు, గుండెమోని జయమ్మ, మంచాల సహకార సంఘం చైర్మన్ వెదిరే హనుమంత్ రెడ్డి, అధికారులు ఎమ్మార్వో ప్రసాదరావు, ఎంపీడీఓ బాలశంకర్, ఆరుట్ల స్కూల్ హెచ్ఎం గిరిధర్ గౌడ్, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుప్రియ, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సాతిరి ఎల్లేష్, కొర్ర పాండు, మండల పార్టీ అధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరిక రమాకాంత్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్, సుంకరి పాండరీనాథ్, ఎడమ నరేందర్ రెడ్డి, జెనిగ వెంకటేష్ ప్రేమాకర్ రెడ్డి, అశ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు