Mahaa Daily Exclusive

  చిన్న కాలేశ్వరం పనులను స్పీడప్ చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..!

Share

భూపాలపల్లి, మహా : కాటారం సబ్ డివిజన్లో సుమారు 40000 ఎకరాలకు సాయినాథ్ సాగునీరు అందించే చిన్న కాలేశ్వరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.
శనివారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో చిన్న కాళేశ్వరం పనులు ప్రగతిపై ఇరిగేషన్ , ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు మెగా కంపెనీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో వేగం పెంచాలని తెలిపారు. ఆధునీకరణలో ఉన్న చెరువుల, కాలువల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పంపు హౌస్ పనులను సైతం వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. భూ సేకరణ సమస్యలు ఉన్న గ్రామాల్లో లో గ్రామ సభలు నిర్వహించి గ్రామస్థులతో తీర్మానం చేయించాలని, భూసేకరణ పూర్తి అయిన గ్రామాలలో పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సోమవారం నుండి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులలో పురోగతిని పరిశీలించి నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, ఇరిగేషన్ ఈ.ఈ సూర్య ప్రకాష్, మెగా కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.