హన్మకొండ మహా;
మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా గత వారంలో 19 మంది వాహనదారులు జైలు శిక్ష అనుభవించారని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా పత్యక్షంగాని, పరోక్షంగాని రోడ్డు ప్రమాదాలకు ప్రధానకారకులు కావడంతో కొన్ని సందర్భాల్లో సదరు మద్యం సేవించిన వాహనదారుడు సైతం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. తద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది దృష్టిలో ఉంచుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ మద్యం సేవించి వాహనదారుల వలన కలిగే రోడ్డు ప్రమాదాల నివారణ కై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే వరంగల్ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్, లా అండ్ ఆర్ధర్ పోలీసులు నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు చేపడుతున్నారని అలాగే గ్రామీణా ప్రాంతాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు నిర్వహించబడుతున్నాయి. ప్రధానంగా వరంగల్ ట్రై పరిధిలో ట్రాఫిక్ పోలీసులు చేపట్టే డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ముందుగా కమిషనరేట్ కార్యాలయంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ వారు వాహనదారుల కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చడం ద్వారా వాహనదారులకు కోర్టులో జైలు శిక్ష లేదా జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గత వారం రోజుల్లో ట్రైసిటి ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో మొత్తం 368 కేసులు నమోదు కాగా, ఇందులో 19 మందికి వాహనదారులకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, 5లక్షల 82వేల రూపాయలు వాహనదారులపై ఫైన్ రూపంలో కోర్టులో జరిమానాలు చెల్లించారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. నమోదైన కేసుల్లో అత్యధికంగా వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 168 కేసులు నమోదు కాగా ఇందులో 06 మందికి జైలు శిక్ష పడగా, 2లక్ష 22వేల ఐదు వందల రూపాయల్లో వాహనదారులు కోర్టు లో జరిమానా చెల్లించారు. ఇదే రీతిలో హన్మకొండ పరిధిలో 104 కేసులో 08మంది కి జైలు శిక్ష, 1లక్ష 09వేల రూపాయల జరిమాన, కాజీపేట పరిధిలో మొత్తం 95 కేసులు నమోదు కాగా ఇందులో ఐదుగురికి జైలు శిక్ష పడగా, మిగితా కేసుల్లో మొత్తం 2లక్ష 50వేల ఐదు వందల రూపాయలు జరిమానా చెల్లించారని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ వాహన దారులకు సూచన చేస్తూ మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని, మీరు చేసే తప్పిదాలతో ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయినవారు కొందరైతే మరి కొందరు అంగవైకల్యంతో జీవితాలను కొనసాగిస్తూన్నారని గుర్తు చేశారు. ఇకనైన వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులు మీ గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ పేర్కొన్నా








