Mahaa Daily Exclusive

  కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమీడి శ్రీనివాస్..!

Share

వరంగల్ మహా;

బిజేపి ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటున్నదని గీసుకొండ మండలం అనంతారం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతన్న మేలుకో.. వ్యవసాయం గురించి షార్ట్ ఫిలిం ప్రోగ్రాం ప్రొజెక్టర్ ద్వారా గ్రామస్థులకు చుపెట్టడం జరిగింది. ఈ సభకు బోయపాటి నరసింహారావు అధ్యక్షతన రైతుల సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా సంఘ రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు .ప్రధాన కారణం పంటలకు మోడి గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం.వ్యాపారస్తులకు లాభాలు చేయడానికి రైతుల పొట్ట కొట్టడం. పంటలకు సరైన గిట్టుబాటు ధర నిర్ణయించే అధికారం కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఉన్నందున గతంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నప్పటికీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించడం లేదని పెరిగిన విత్తనాలు , ఎరువులు ,పురుగు
మందులు , ట్రాక్టర్, కూలీల ఖర్చులను పరిగణంలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల రైతులకు కొన్ని సందర్భాల్లో పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదు. మార్కెట్లోకి రైతుల పంటలు రాగానే ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయి. ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేయాలని అలాగే పత్తిని సి సి ఐ కొనుగోలు చెప్పినప్పటికీ సరైన సమయంలో కొనుగోలు చేయడం లేదని కొంత మంది దళారులు కొనుగోలు చేసిన ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారని ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి ఎంతో దారుణంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి రైతులను ఆదుకోవాలని కనీస మద్దతు ధరలు నిర్ణయించి , కేంద్రం ద్వారా పంటలను కొనుగోలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని గ్రామ కమిటీని 7 ఏడుగురు తో ఏర్పాటు చేశారు. అధ్యక్షులుగా బోయపాటి నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా గద్దె రామారావు, తో పాటు సయింపు వెంకటేశ్వరరావు, దండ ఆదినారాయణ, గద్దె నాగేశ్వరరావు, శ్రీనివాస్, రవీందర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.