Mahaa Daily Exclusive

  సీతారామ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం – కాంగ్రెస్‌కు పిండప్రదానం..!

Share

పాల్వంచ:మహా.
ఈ నెల 30న ములకలపల్లి మండలంలోని పూసుగూడెం సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్-2 వద్ద కాంగ్రెస్ పార్టీకి పిండప్రదానం కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనుంది. పాల్వంచ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ్ పటేల్, జిల్లా మహిళా నాయకురాలు కాలేరు సింధు తపస్వి శనివారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సీతారామ ప్రాజెక్టు 18 వేల కోట్ల రూపాయలతో 90 శాతం పూర్తయిందని, కానీ మిగిలిన 10 శాతం పనులను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ప్రాజెక్టు నీటిని భద్రాద్రి కొత్తగూడెం రైతులకు ఇవ్వకుండా, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు తరలించడం అన్యాయం అని విమర్శించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు సాగునీరు అందించే వరకు ఈ నీటిని ఇతర జిల్లాలకు పంపొద్దని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే పిండప్రదానం తరువాత బీఆర్ఎస్ నేతలు, రైతులు కలసి ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పార్టీ నేతలు సంగ్లోత్ రంజిత్, కొత్తచెరువు హర్షవర్ధన్, కొట్టే రాఘవేంద్ర, ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, తోట లోహిత్ సాయి, దరిమెళ్ల మురళీకృష్ణ, గిద్దలూరి శివసాయి, కూరెల్లి మురళీమోహన్ పాల్గొన్నారు.