Mahaa Daily Exclusive

  ఛానల్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి -ఆదిలాబాద్ లో జర్నలిస్టుల నిరసన..!

Share

ఆదిలాబాద్, మహా

హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానల్ కార్యాలయం పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని జర్నలిస్ట్ జే ఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏ మేరకు ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ లో నిరసన తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీ గా అక్కడికి చేరుకొని దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా జేఏసీ ఛైర్మెన్ నూకల దేవేందర్ మాట్లాడుతూ జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు నిత్యాకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఇలాంటి భౌతిక దాడులకు దిగడం హేయమైన చర్యగా అభివర్ణించారు. దాడి కి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఈ నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ బీర్కూర్ వారు వెంకటేష్,జర్నలిస్టులు కృష్ణాకాంత్ గౌడ్, ఏర సుధాకర్, మెడపట్ల సురేష్, మొయిస్, అనిల్, నిలేష్, దత్తాత్రి, అభిలాష్, అరుణ్ రెడ్డి, దీపక్, కిరణ్ రెడ్డి, విఠల్, అస్మత్,నర్సింగ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.