Mahaa Daily Exclusive

  కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ సస్పెన్షన్ -ఆరేళ్ల పాటు విధించిన ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ…!

Share

ఆదిలాబాద్, మహా
కుమురంభీం జిల్లా సిర్పూర్ నియోజక వర్గ కాంగ్రెస్ అభ్యర్థి రావి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరేళ్ళ పాటు సస్పెన్షన్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద రావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ తెలిపింది.

సస్పెన్షన్ తో ఎలాంటి నష్టం లేదు

కాంగ్రెస్ పార్టీ విధించిన సస్పెన్షన్ తో తనకు ఎలాంటి నష్టం జరగదని రావి శ్రీనివాస్ తెలిపారు. నిత్యం కార్యకర్తలను రక్షిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ నియోజకవర్గానికి తాను ఇచ్చే బహుమతి కోసం ఎదురుచూడాలని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఇంఛార్జి వద్ద మంత్రి సీతక్క ఒత్తిడి తీసుకొచ్చి తనను సస్పెండ్ చేయించారని శ్రీనివాస్ తెలిపారు.