ఆదిలాబాద్, మహా
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీబీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బలవంతరావు అన్నారు. ఆదివారం తిర్పెల్లి రామ మందిరంలో నిర్వహించిన బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిచయ వేదికకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,మహారాష్ట్ర నుంచి యువతీ, యువకులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు అని తెలిపారు. బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 22 పరిచయ వేదికలు నిర్వహించినట్లు తెలిపారు .పెళ్లికాని యువతి యువకుల వివరాలను పుస్తకం లో పొందుపరిచి తల్లిదండ్రులకు అందజేయనున్నామని తెలిపారు. దీని ద్వారా తమకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం వల్ల పిల్లలకు మంచి సంబంధాలు దొరకడమే కాకుండా, ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. అదిలాబాద్ బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. వివాహ పరిచయ వేదికలో 135 మంది యువతీ యువకులు తమ వివరాలను అందజేశారని అన్నారు. కార్యక్రమంలో టీబీఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ మోహన్, ట్రెజరర్ అమిత్ దేశ్పాండే, ఆదిలాబాద్ బ్రాహ్మణ పరి షత్ అధ్యక్షుడు అన్నోజుల సంతోష్, కార్యదర్శి విశ్వాస్, ట్రెజరర్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.








