Mahaa Daily Exclusive

  గంజాయి విక్రయిస్తే ఆస్తులు జప్తు: చంద్రబాబు

Share

AP: మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ఆదివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి విక్రయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి బ్యాచ్‌ను కాపాడాలి అనుకునే వారిని కూడా గంజాయి బ్యాచ్‌గానే పరిగణిస్తామని, గంజాయి విక్రయించే వారి ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించారు. వారి కుటుంబాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు రాకుండా నిలిపివేస్తామన్నారు.