Mahaa Daily Exclusive

  పదవీ విరమణ పొందిన పలువురు అధికారులకు ఆత్మీయ సన్మానం..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 30 (మహా):
సోమవారం సింగరేణి సంస్థ లో  వివిధ ఏరియాలలో వివిధ హోదాలలో పని చేసి ప్రస్తుతం కార్పొరేట్ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్ల నందు జి‌ఎం లుగా పనిచేస్తూ సోమవారం పదవీ విరమణ పొందిన సంధర్భంగా  జి‌ఎం(ఫైనాన్స్) ఐ అండ్ ఏ జి.వెంకట రమణ, జి‌ఎం(సోలార్) జి.ఎస్.జానకి రామ్, జి‌ఎం(ఆర్ అండ్ డి) ఆర్.నారాయణ రావు, జి‌ఎం(ఈ అండ్ ఎం) ఏ‌పి‌హెచ్‌ఎం‌ఈ‌ఎల్ జే.నాగరాజులను డైరక్టర్(ఈ అండ్ ఎం)  డి.సత్యనారాయణ రావు, డైరక్టర్ (ఆపరేషన్స్)  ఎల్.వి.సూర్యనారాయణ మరియు డైరక్టర్(పి&పి) కే.వెంకటేశ్వర్లు సి‌పి‌పి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో  పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
సింగరేణి సంస్థ లో సుమారు 35 సంవత్సరాల సుధీర్ఘ సర్వీసులో వివిధ  గనులు మరియు డిపార్ట్మెంట్లలో పనిచేసి ప్రస్తుతం  పర్సనల్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ వింగులో కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ గా పనిచేస్తూ  సోమవారం పదవీ విరమణ చేసిన సీనియర్ పర్సనల్ ఆఫీసర్ టి.శ్రీనివాస రావు ని జి‌ఎం(పర్సనల్) ఐ‌ఆర్ అండ్ పి‌ఎం  కవితా నాయుడు, జి‌ఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్  జి.వి.కిరణ్ కుమార్ మరియు వెల్ఫేర్, ఏ‌ఈ‌పి‌ఏ‌టి‌బి సెల్, ఆర్‌సి, ఐ‌ఆర్ అండ్ పి‌ఎం, ఈ‌ఈ సెల్, ఈ‌ఆర్‌పి, కమ్మ్యూనికేషన్, స్పొర్ట్స్, సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ విభాగాల డి‌జి‌ఎం(పర్సనల్) లు, డి‌వై.పి‌ఎం లు, సీనియర్ పి‌ఓ లు మరియు ఇతర అధికారులు మరియు పర్సనల్ డిపార్ట్మెంట్ల సిబ్బంది సింగరేణి ప్రధాన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం పూల మాలలతో, శాలువాలతో జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు, జిఎంలు మాట్లాడుతూ, పలు పదవుల్లో సింగరేణి సంస్థ లో పలు పదవుల్లో వారు క్రమ శిక్షణ తో, అంకిత భావంతో విధులు నిర్వహించి స్నేహపూర్వకంగా అందరి మన్ననలు పొందారని, ఫైనాన్స్, మైనింగ్, సోలార్, క్వాలిటి, ఆర్&డి, మరియు ఈ అండ్ ఎం విభాగానికి వారు చేసిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. పదవీ విరమణ అనంతరం వారి శేషజీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమములో  జి‌ఎం(సి‌పి‌పి) ఏ.మనోహర్, జి‌ఎం(సేఫ్టీ) సి‌హెచ్.శ్రీనివాస్, జి‌ఎం(ఫైనాన్స్) ఎం.సుబ్బా రావు, జి‌ఎం(డబల్యూ‌ఎస్ ఈ‌ఎం) ఫిజరాల్డ్ జేసురత్నం, జి‌ఎం(ప్రాజెక్ట్ ప్లానింగ్) కే.సాయి బాబు,  జి‌ఎం(సి‌ఎం‌సి) శ్రీనివాస రావు, జి‌ఎం(పర్సనల్)  కవితా నాయుడు, జి‌ఎం(పర్సనల్) జి.వి.కిరణ్ కుమార్, సి‌ఎం‌ఓ ఆర్.కిరణ్ రాజ్ కుమార్,  జి‌ఎం(ఈ‌ఈ సెల్) ఎం‌డి సూపర్ బజార్ ఏ‌జే‌ఎం మురళీధర్, జి‌ఎం(ఈ ఎం) స్టోర్స్ ఎలిషా, జి‌ఎం(ఆర్&డి) ఎం.కనకయ్య, జి‌ఎం(హెచ్‌ఆర్‌డి) వెంకట రామి రెడ్డి, హెచ్‌ఓ‌డి (ఐ‌టి) పి.హరి శంకర్, జి‌ఎం(ఎస్టేట్స్) ఎన్.రాధా కృష్ణ,  జి‌ఎం(టెక్నికల్ సర్వీస్) పి.మురళీ కృష్ణ, హెచ్‌ఓ‌డి(ఐ&పి‌ఎం) జే.వెంకట రమణ, ఇతర జి‌ఎం లు,డి‌జి‌ఎం(పర్సనల్) లు కే.అజయ్ కుమార్, కేసా నారాయణ రావు,  పి.వేణు గోపాల రావు, వై‌వి‌ఎల్ వర ప్రసాద్, ఎస్.వేంకటేశ్వర రావు, బి.రాజ గోపాల్, బి.శివ కేశవ రావు డి‌వై.పి‌ఎం లు వి.అనిల్ కుమార్, కే.ప్రవీణ్ కుమార్, కే.శివ కుమార్, కే.సంతోష్ కుమార్ , జి.నాగేశ్వర రావు, కే.సునిల్ కుమార్,  సీనియర్ పి‌ఓ లు సీనియర్ పి‌ఓ గౌస్ పాష, ఎం.శ్రీనివాస్, డి‌వై.ఎఫ్‌ఎం ఈ.రమేష్, అకౌంట్స్  ఆఫీసర్ జే.వి.ఎస్.రామా రావు, పర్సనల్  డిపార్ట్మెంట్ అధికారులు,  పర్సనల్ విభాగ సిబ్బంది  అధికారులు పాల్గొన్నారు.

Latest