ఖమ్మం సిటీ, మహా
సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టీజీ ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా విద్యుత్ శాఖ ఇంజనీర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలి యోజన కింద ఏర్పాటు చేసిన ఈ శిక్షణలో రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నారు.
సోమవారం ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి ప్రారంభించారు. ఆయనతో పాటు డివిజనల్ ఇంజనీర్లు బాబురావు, రామారావు, నాగేశ్వరరావులు పాల్గొన్నారు. నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు ఇంజనీర్లకు సాంకేతిక శిక్షణ ఇస్తున్నారు.
ఈ రెండు రోజుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి, మీటర్ అమరిక, భద్రత ప్రమాణాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Post Views: 62







