Mahaa Daily Exclusive

  పిఎ సి ఎస్ కార్యదర్శిగా పదవి విరమణ పొందిన ఏలూరి ఆనందరావు ..!

Share

రుమలాయపాలెం,మహా:

మండలంలోని పీ ఏ సి ఎస్ కార్యదర్శి పదవి విరమణ పొందుతున్న ఏలూరి ఆనందరావు కి ఆదివారం జిల్లా కాంగ్రెస్ నాయకులు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావ. శివరామకృష్ణ శాలవతో కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పిండిప్రోలు సొసైటీల ద్వారా వారు రైతులకు అందించిన సేవలను గుర్తుచేసి వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమం లో పీ ఏ సీ ఎస్ చైర్మన్ , డి సీ సీ బి డైరక్టర్ చావా. వేణుగోపాలకృష్ణ , పీ ఏ సీ ఎస్ మాజీ చైర్మన్ పూసులూరి. పుల్లయ్య, కమ్మకోట. నాగేశ్వరావు, చామాకురి రాజు, చల్లా. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Latest