తిరుమలాయపాలెం,మహా;
మండల కేంద్రంలో మంజూరు అయిన ఐటిఐ కళాశాలను సర్వే నెంబరు 254 లో ప్రభుత్వ భూముల్లో ఖమ్మం , వరంగల్ రహదారి ప్రక్కన నిర్మించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు అఖిలపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మండల కేంద్రంలో ఐటిఐ కళాశాల, గత సుదీర్ఘ పోరాటాల అనంతరం ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని,
మంజూరు చేయించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అఖిల పక్షం తరుపున మరియు మండల ప్రజల తరుపున ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఐటిఐ కళాశాలను,ఖమ్మం టూ వరంగల్ హైవే రోడ్డు పక్కన కాకుండా తప్పుడు సమాచారం అందిస్తూ,ఊరికి దూరంగా కట్టాలని చెప్పుతున్న వారి మాటలను వినకుండా అట్టి ఆలోచనను విరమించుకొని,
రోడ్డు ప్రక్కన కట్టడం వల్ల మండలం లోని అన్ని గ్రామాల ప్రజలకు, విద్యార్థుల కు,అందుబాటులో ఉండటానికి అవకాశం ఉందని మండల కేంద్రం కూడా అభివృద్ధి కావటానికి అవకాశం ఉంటుందన్నారు.
అనంతరం ఎంపిడిఓ, తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో
సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను బిఎస్పి పాలేరు అసెంబ్లీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లు,ఎన్నబోయిన రమేష్, కొమ్ము పూలే
బి ఆర్.ఎస్ నాయకులు గంట కృష్ణ గుగ్గిల అశోక్, ఎమ్మార్పీఎస్ నాయకులు పగిడిపల్లి బాబు,చింతి రాల రాంబాబు,వంగూరి మధు, సీ పీ ఐ మండల నాయకులు చీమ రామకృష్ణ,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ నాయకులు తిమ్మిడి హనుమంతరావు కొమ్ము నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు..







