Mahaa Daily Exclusive

  వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తాం సీబీఎస్ ఫౌండేషన్ చైర్మన్ జి చంద్ర శేఖర్

Share

తిరుమలాయపాలెం,మహా;
నిరుపేదల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామని,చేగువేర భూపతి ఫౌండేషన్ ఎల్లప్పుడూ నిరుపేదలకు అండగా ఉంటుందని ఆ సంస్థ ఫౌండర్ జి. చంద్రశేఖర్ అన్నారు. మండల పరిధిలోని
సుబ్లేడు, పిండిప్రోలు, కొక్కిరేణి గ్రామాల నిరుపేదలకు ఆదివారం12 మందికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా. ఫౌండేషన్ చైర్మన్ జి చంద్ర శేఖర్ మాట్లాడుతు ప్రస్తుత పరిస్థితుల్లో ఎందరో  నిరుపేదలు ఒకపూట భోజనం చేయలేని పరిస్థితిలో. ఉన్నారని. ఆకలితో అలమటించి చాలామంది చనిపోతున్నారని అలాంటి వారికి అండగా ఉండడం కోసమే. ఈ సి బి ఎఫ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది అన్నారు. ఈ ఫౌండేషన్
2019 లో  మొదలై ఆనాటి నుంచి నేటి వరకు  రెండు తెలుగు రాష్ట లో 680 నుండి 700 మందికి పైగా పేద వృదులకు.అనాథలకు. వితంతువూలకు.నిత్యవసర సరుకులు పంపిణీని చేయడం జరుగుతుంది అని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేద కుటుంబాలకు. ఫౌండేషన్ ద్వారా. తన వంతు గా నిరుపేద కుటుంబాలకు నేరుగా వారి ఇంటికి వెళ్లి రెండు నెలలకి సరిపడా 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, టీ పొడి, కారం,ఉప్పు, గోధుమపిండి పాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేద వృద్దులకు  అండగా ఉండడం కోసం త్వరలో . వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ చావా వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్.ఎం జ్యోతి, మరియు కళాశాల ఉపాధ్యాయులు, మౌలాలి నారాయణ, పరుశురాం, భద్రం లలిత, శ్రీలత, ఫౌండేషన్ బృందం, గంట భీమయ్య, సుధాకర్, కొమ్ము రమేష్, అజిత, హరితశ్రీ, రాధిక,మల్లయ్య, సందీప్,గంట రవికుమార్. తదితరులు పాల్గొన్నారు.