Mahaa Daily Exclusive

  సంక్షేమ పధకాల పై విస్తుత ప్రచారం చేయాలి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజిని..!

Share

నేలకొండపల్లి, జూన్ 30 మహా :

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి విస్త్రుత ప్రచారం చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జెర్రిపోతుల అంజిని పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ముఖ్య కార్యకర్తల సమావేశం ను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు…రానున్న స్థానిక సంస్థలలో కాంగ్రెస్ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన పధకాలే కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు కు శ్రీరామ రక్ష అన్నారు. పార్టీ ని మరింత బలోపేతం చేసేందుకు వార్డుల వారీగా ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. నేలకొండపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ లను భారీ మెజార్టీతో గెలిపించాలని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రేషన్కార్డులు ఇతరత్రా పధకాల పై ఇంటింటా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్లు వంగవీటి నాగేశ్వరరావు, మామిడి వెంకన్న, మాజీ ఎంపీటీసీ బొడ్డు బొందయ్య, నాయకులు చిదుముల జాన్రెడ్డి, వాకా శ్రీనాధ్, రాంబాబు, జెర్రిపోతుల సత్యనారాయణ, కడియాల నరేష్, రంగయ్య, ఐతనబోయిన శ్రీనివాసరావు, మోర మల్లయ్య, కైలాపసు వెంకటేశ్వర్లు, గుడిబోయిన వెంకటేశ్వర్లు, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.