AP: కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు తల్లికి వందనం పేరు చెప్పి బ్యాంకులో డబ్బులు ఖాళీ చేస్తున్నారు. ‘తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? మీ అకౌంట్ హోల్డ్‌లో ఉంది’ అంటూ నేరగాళ్లు కాంటాక్ట్ అవుతున్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు తెలుసుకుని డబ్బులు కాజేస్తున్నారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Post Views: 107








